ప్రతిరోజూ చదివిన దేవుని వాక్యాన్ని తరచుగా పునశ్చరణ చేయకపోతే, అది మన జ్ఞాపకంలో మెల్లగా మాయమవుతుంది. అందుకే ఆ వారం ప్రచురించిన రోజువారీ క్విజ్‌ల ఆధారంగా ఈ వీక్లీ క్విజ్‌లు రూపొందించబడి, ఆ వారంలో నేర్చుకున్న విషయాలను సులభంగా పునశ్చరణ చేసుకోవడానికి సహాయపడతాయి.
వీక్లీ క్విజ్‌లు,మన అవగాహన స్థాయిని పెంచడమే కాకుండా, క్రమపద్ధతిగా బైబిల్ చదివే అలవాటును మరింత బలోపేతం చేయడానికి సహాయపడతాయి. ఈ వీక్లీ క్విజ్‌లను మీ కుటుంబ సభ్యులు, మిత్రులతో పంచుకుని, మరింత సరదాగా మరియు ఉపయోగకరంగా చేసుకోవచ్చు. ప్రతి వారంలో సాధించిన విజయం మరియు నేర్చుకున్న వాక్యాలు, మన ఆత్మీయ జీవితములో సరైన మార్గములో ముందుకు వెళ్ళడానికి, దేవుని యొక్క మేలులు పొందడానికి సహాయపడాలని మా ప్రార్ధన.