📜 బైబిల్ క్విజ్ నియమాలు & మార్గదర్శకాలు

TheBibleQuiz.in లోని క్విజ్ ల ద్వారా రోజుకి కొంచెం అయినా దేవుని వాక్యము నేర్చుకునేలా, పారదర్శకముగ మరియు అందరికి ఉపయోగపడేలా ఉండులాగున మేము ప్రయతిస్తున్నాము. పాల్గొనే ప్రతి ఒక్కరు కింది నియమాలను గౌరవించాలని మనవి చేస్తున్నాం.


🏆 Top 20 :

  • క్విజ్‌లో సాధించిన మార్కులు మరియు క్విజ్ పూర్తి చేసిన సమయం ఆధారంగా Top 20 నిర్ణయించబడుతుంది.
  • గరిష్ట మార్కులు సాధించి, క్విజ్‌ను ముందుగా పూర్తి చేసినవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
  • క్విజ్ పోస్ట్ చేసిన సమయం నుండి 24 గంటలలోపు పూర్తి చేసిన ప్రయత్నాలు మాత్రమే పరిగణించబడతాయి.

📅 రోజువారీ క్విజ్ (Daily Quiz) నియమాలు:

  • రోజువారీ క్విజ్‌లు ప్రతిరోజూ పోస్ట్ చేయబడతాయి.
  • రోజువారీ క్విజ్‌కు సమయ పరిమితి లేదు.
  • ప్రత్యేక విజేత ప్రకటన ఉండదు.
  • అయితే, వీటి మార్కులు వారంవారీ మరియు నెలవారీ క్విజ్‌ల విజేతలను నిర్ణయించడంలో ఉపయోగించబడతాయి.

🥇 విజేతల నిర్ణయ విధానం (Winner Criteria):

  • క్విజ్ పోస్ట్ చేసిన 24 గంటల్లో గరిష్ట మార్కులు సాధించినవారు విజేతలుగా పరిగణించబడతారు.
  • ఒకటి కంటే ఎక్కువ మంది ఒకే మార్కులు సాధిస్తే:
    • గత 7 రోజుల రోజువారీ క్విజ్‌ల మార్కులు పోల్చబడతాయి.
    • సంబంధిత రోజువారీ క్విజ్‌లలో 24 గంటలలో పూర్తిచేయబడిన రోజువారీ క్విజ్‌లు మాత్రమే పరిగణించబడతాయి.
    • అవి కూడా సమానం అయితే, అసలు క్విజ్‌ను ముందుగా పూర్తి చేసినవారికి విజేతగా పరిగణించబడతారు.

📆 వారంవారీ క్విజ్ (Weekly Quiz) నియమాలు:

  • వారంవారీ క్విజ్‌లు ప్రతి ఆదివారం పోస్ట్ చేయబడతాయి.
  • ఆ వారం మొత్తం రోజువారీ క్విజ్‌ల ఆధారంగా రూపొందించబడతాయి.
  • నిర్ణయించిన విజేత ప్రమాణాల ప్రకారం విజేతలు ప్రకటించబడతారు.

🗓️ నెలవారీ క్విజ్ (Monthly Quiz) నియమాలు:

  • ప్రతి నెల చివరి రోజున నెలవారీ క్విజ్ పోస్ట్ చేయబడుతుంది.
  • ఆ నెలలో ఉన్న రోజువారీ మరియు వారంవారీ క్విజ్‌ల ఆధారంగా ఉంటుంది.
  • విజేతలు తదుపరి రోజు లేదా తదుపరి ఆదివారం ప్రకటించబడతారు.

🎉 ప్రత్యేక క్విజ్ (Special Quiz) నియమాలు:

  • ప్రత్యేక క్విజ్‌లను ఎవరైనా బైబిల్ క్విజ్ బృందం సహాయంతో నిర్వహించవచ్చు.
  • విజేతల నియమాలు అవసరమైతే, బైబిల్ క్విజ్ బృందంతో సంప్రదించి మార్పులు చేసుకోవచ్చు.
  • సందేహాలు లేదా సూచనల కోసం బైబిల్ క్విజ్ బృందాన్ని సంప్రదించవచ్చు.

⛪ చర్చి క్విజ్ (Church Quiz) నియమాలు:

  • చర్చి క్విజ్‌లు చర్చి పాస్టర్ ద్వారా పోస్ట్ చేయబడతాయి.
  • విజేతలను నిర్ణయించే విధానం పాస్టర్ వారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
  • ఈ క్విజ్‌లు ఒక నిర్దిష్ట కాలం తరువాత తొలగించబడతాయి.

⏱️ క్విజ్ సమయ పరిమితి (Time Limit):

  • రోజువారీ క్విజ్‌లకు సమయ పరిమితి లేదు.
  • వారంవారి మరియు నెలవారీ క్విజ్ లకు, ఇవ్వబడిన ప్రశ్నల ఆధారముగా సమయం నిర్ణయించబడుతుంది.
  • స్పెషల్ మరియు చర్చి క్విజ్ లకు, క్విజ్ ను నిర్వహించేవారు సమయాన్ని నిర్ధారిస్తారు.

📊 లీడర్ బోర్డ్ (Leader Board) నియమాలు:

  • లీడర్ బోర్డ్ గత 30 రోజుల అన్ని క్విజ్‌ల మార్కుల ఆధారంగా రూపొందించబడుతుంది.
  • చర్చి క్విజ్‌ల మార్కులు లీడర్ బోర్డ్ లెక్కలలో పరిగణించబడవు.


గమనిక: ఈ నియమాలు పారదర్శకంగా క్విజ్‌ల నిర్వహణ కోసం మాత్రమే రూపొందించబడినవి. బైబిల్ క్విజ్ బృందం పరిస్థితుల ఆధారంగా కాలానుగుణంగా నియమాలను సవరించవచ్చు.