Special Bible Quiz (స్పెషల్ బైబిల్ క్విజ్‌లు)

మన జీవితంలోని ప్రత్యేక సందర్భాలు మరియు పండుగల వంటి ఆనందకరమైన సమయాలు కేవలం తాత్కాలిక సంబరాలకే పరిమితం కాకుండా, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ, ఇతరులు కూడా నేర్చుకునేలా చేసి, దేవుని సన్నిధిలో ఆనందించడానికి సహాయపడవచ్చు. ఈ ఉద్దేశంతోనే స్పెషల్ బైబిల్ క్విజ్‌లు రూపొందించబడ్డాయి.


స్పెషల్ బైబిల్ క్విజ్ - ప్రయోజనాలు:

ఇక్కడ మనకు బైబిల్ క్విజ్ టీమ్ రూపొందించిన ప్రత్యేక క్విజ్‌లు, అలాగే వివిధ వ్యక్తులు తమ ప్రత్యేక సందర్భాల సమయములో నిర్వహించిన క్విజ్‌లు అందరికీ కనిపిస్తాయి. ఈ క్విజ్‌ల ద్వారా కుటుంబ సభ్యులు, సంఘ సభ్యులు మరియు మిత్రులు కలిసి సరదాగా టాప్20 మరియు లీడర్ బోర్డు లలో పోటీ పడుతూ దేవుని వాక్యాన్ని నేర్చుకునే అవకాశం కలుగుతుంది.

బైబిల్ మనలను ఒకరికొకరు బోధించుకోవాలని, ప్రోత్సహించుకోవాలని ఆహ్వానిస్తుంది. స్పెషల్ బైబిల్ క్విజ్‌లు ఈ ఆత్మీయ సహవాసాన్ని మరింత బలపరుస్తాయి. ఒక ప్రత్యేక దినాన్ని దేవుని వాక్యంతో జరుపుకోవడం ద్వారా, ఆ ఆనందం తాత్కాలికంగా కాక, ఆత్మీయంగా నిలిచిపోతుంది.

స్పెషల్ క్విజ్ లు ఎలా నిర్వహించబడతాయి?

  • తమ యొక్క ప్రత్యేక సందర్భాన్ని బైబిల్ క్విజ్ సభ్యులు మరియు బంధు మిత్రులందరితో కలిసి దేవుని వాక్యంతో జరుపుకోవాలనుకొను వారు ఎవరైనా ఈ క్విజ్ లను నిర్వహించవచ్చు.
  • క్విజ్ టాపిక్, ప్రశ్నల సంఖ్య, సమయ పరిమితి వంటి అంశాలను క్విజ్ నిర్వహించాలనుకునే వారు నిర్ణయించవచ్చు.
  • విజేతను కూడా క్విజ్ నిర్వహించువారే ఎంపిక చేయవచ్చు.
  • అవసరమైతే, ఇప్పటికే ఉన్న విజేత ప్రమాణాలకు అదనంగా ప్రత్యేక అవసరాల ప్రకారం మార్పులు చేయడంలో బైబిల్ క్విజ్ టీమ్ సహాయపడుతుంది

ఈ విధంగా, స్పెషల్ బైబిల్ క్విజ్‌లు కేవలం పోటీగా కాక, పరస్పర సహవాసాన్ని పెంపొందించే ఒక ఆత్మీయ సాధనంగా మారతాయి. అందుకే ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని, ఇతరుల ప్రత్యేక సందర్భాలను కూడా ఆనందంగా భాగస్వామ్యం చేయాలని మేము కోరుకుంటున్నాము.