Church Bible Quizzes అనేవి స్థానిక సంఘాలకు ఉపయోగపడేలా ప్రత్యేకంగా రూపొందించిన బైబిల్ క్విజ్‌లు. ప్రతి సంఘ పాస్టర్ లేదా సంఘ నాయకుడు తన సంఘ సభ్యుల ఆత్మీయ ఎదుగుదల కోసం ఈ క్విజ్‌లను రూపొందించి పోస్ట్ చేయవచ్చు.
ఈ క్విజ్‌లు డైలీ క్విజ్ లేదా వీక్లీ క్విజ్ లేదా స్పెషల్ క్విజ్ లకు భిన్నంగా, ఒక నిర్దిష్ట సంఘానికి మాత్రమే సంబంధించినవిగా ఉంటాయి. ఉదాహరణకు, ఆదివారం సంఘములో బోధించిన విషయాలపై, యువతకు లేదా సంఘ సభ్యులకు అవగాహన కల్పించడానికి చర్చ్ క్విజ్‌లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి అని భావిస్తున్నాము.
ఇక్కడ మీకు మీరు సభ్యులుగా ఉన్న మీ చర్చ్‌కు సంబంధించిన క్విజ్‌లు మాత్రమే కనిపిస్తాయి. చర్చ్ క్విజ్‌లను చూడడానికి మరియు పాల్గొనడానికి, మీరు లాగిన్ అయి ఉండాలి మరియు సరైన Church Codeను మీ ప్రొఫైల్‌లో నమోదు చేసి ఉండాలి. ఒకవేళ మీకు ఇంకా చర్చ్ క్విజ్‌లు కనిపించకపోతే, దయచేసి మీ పాస్టర్ నుండి సరైన Church Codeను పొంది, మీ ప్రొఫైల్‌లో అప్డేట్ చేయండి. ఏమైనా సందేహాలు ఉంటె బైబిల్ క్విజ్ టీమ్ వారిని సంప్రదించగలరు.
చర్చ్ బైబిల్ క్విజ్‌లు కేవలం పోటీ కోసమే కాక, సంఘ నిర్మాణానికి మరియు ఆత్మీయ ఎదుగుదలకు ఒక ఉపయోగకరమైన సాధనంగా ఉంటాయి అని ఆశిస్తున్నాము.