Daily Bible Quiz(రోజువారీ బైబిల్ క్విజ్):

ప్రతిరోజూ బైబిల్ చదవడం ద్వారా మన విశ్వాసం బలపడుతుంది; మన దైనందిన జీవితంలో దేవుని చిత్తాన్ని గ్రహించి, సరియైన మార్గంలో నడవడానికి అది సహాయపడుతుంది. అలాగే ప్రతిరోజూ చదివిన వాక్యాన్ని ఆధారంగా చేసుకొని బైబిల్ క్విజ్‌లో పాల్గొనడం వలన, చదివిన వాక్యము మనకు మరింత స్పష్టంగా గుర్తుండిపోతుంది మరియు ప్రతిరోజూ బైబిల్ చదివే మంచి అలవాటు క్రమంగా పెంపొందించుకోవచ్చు.

Chapter-wise Daily Quizzes:

Seq No Name No of Questions Date Action Top 20
21 1 కొరింథీ 12, 1 నుండి 11 వచనములు వరకు 9 2026-01-31 Take QuizTop 20
22 1 కొరింథీ 11, 17 నుండి 34 వచనములు వరకు 7 2026-01-29 Take QuizTop 20
23 1 కొరింథీ 11, 1 నుండి 16 వచనములు వరకు 10 2026-01-28 Take QuizTop 20
24 1 కొరింథీ 10, 14 నుండి 33 వచనములు వరకు 10 2026-01-27 Take QuizTop 20
25 1 కొరింథీ 10, 1 నుండి 13 వచనములు వరకు 10 2026-01-26 Take QuizTop 20
26 1 కొరింథీ 9, 1 నుండి 27 వచనములు వరకు 10 2026-01-25 Take QuizTop 20
27 1 కొరింథీ 8, 1 నుండి 13 వచనములు వరకు 8 2026-01-24 Take QuizTop 20
28 1 కొరింథీ 7, 25 నుండి 40 వచనములు వరకు 8 2026-01-23 Take QuizTop 20
29 1 కొరింథీ 7, 1 నుండి 24 వచనములు వరకు 10 2026-01-22 Take QuizTop 20
30 1 కొరింథీ 6, 1 నుండి 20 వచనములు వరకు 8 2026-01-21 Take QuizTop 20
31 1 కొరింథీ 5, 1 నుండి 13 వచనములు వరకు 7 2026-01-20 Take QuizTop 20
32 1 కొరింథీ 4, 1 నుండి 21 వచనములు వరకు 10 2026-01-19 Take QuizTop 20
33 1 కొరింథీ 3, 1 నుండి 23 వచనములు వరకు 10 2026-01-18 Take QuizTop 20
34 1 కొరింథీ 2, 1 నుండి 16 వచనములు వరకు 10 2026-01-17 Take QuizTop 20
35 1 కొరింథీ 1, 13 నుండి 31 వచనములు వరకు 10 2026-01-16 Take QuizTop 20
36 1 కొరింథీ 1, 1 నుండి 12 వచనములు వరకు 10 2026-01-15 Take QuizTop 20
37 రోమీయులకు 16, 1 నుండి 27 వచనములు వరకు 8 2026-01-14 Take QuizTop 20
38 రోమీయులకు 15, 14 నుండి 33 వచనములు వరకు 7 2026-01-13 Take QuizTop 20
39 రోమీయులకు 15, 1 నుండి 13 వచనములు వరకు 6 2026-01-12 Take QuizTop 20
40 రోమీయులకు 14, 1 నుండి 23 వచనములు వరకు 10 2026-01-11 Take QuizTop 20

ప్రతిరోజూ బైబిల్ చదవడం యొక్క ప్రాముఖ్యత:

బైబిల్ కేవలం ఒక చారిత్రక పుస్తకం మాత్రమే కాదు; అది మన జీవితానికి మార్గదర్శకమైన దేవుని జీవవాక్యం. ఈ బలముగలిగిన, సజీవమైన దేవుని వాక్యము మన హృదయములోని తలంపులను మరియు ఆలోచనలను శోధించగల శక్తిని కలిగి ఉంది. అందుచేత ప్రతిరోజూ దానిని ధ్యానించుట వలన, మన ఆలోచనలు పరిశుద్ధముగా ఉండి, దేవునికి ప్రీతికరముగా జీవించుటకు మనకు సహాయపడుతుంది.

దావీదు తన జీవితంలోని కష్టకాలాలలో దేవుని వాక్యాన్ని ధ్యానించుట ద్వారా ధైర్యమును మరియు నిరీక్షణను పొందినట్లుగా మరియు అనేక కీర్తనలలో ఆయన దేవుని ధర్మశాస్త్రాన్ని ఎంతగా ప్రేమించెనో మనము గమనించగలము. దేవుని వాక్యము ద్వారా దేవుని చిత్తాన్ని గ్రహించుట మరియు దేవునికి విధేయత చూపుట ఆయన జీవితంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విధమైన విధేయతతో కూడిన జీవితం, దావీదు దేవుని హృదయానికి అనుకూలమైన వ్యక్తిగా బైబిలులో సాక్ష్యము పొందినదిగా మనకు తెలియజేస్తుంది. మనము కూడా ప్రతిరోజూ దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించుట వలన, దావీదు వలెనే మన జీవితంలోని కష్టకాలాలలో ధైర్యమును మరియు నిరీక్షణను పొందగలము.

దేవుడు యెహోషువకు, ధర్మశాస్త్రగ్రంథమును బోధింప విడిచిపెట్టక, దివారాత్రము దానిని ధ్యానించి, అందులో వ్రాయబడిన ప్రకారము చేయుటకు జాగ్రత్తపడవలెనని ఆజ్ఞాపించెను. అలా చేసినయెడల అతని మార్గము వర్ధిల్లునని, అతడు చక్కగా ప్రవర్తించునని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అలాగే కీర్తనల గ్రంథములో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడని వర్ణించబడింది. అతడు నీటికాలువల యోరను నాటబడిన చెట్టువలె ఉండి, తన కాలమందు ఫలమిచ్చునని, అతడు చేయునదంతయు సఫలమగునని దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. అలాగే మనము ప్రతిరోజూ దేవుని వాక్యాన్ని చదవి ధ్యానించుట వలన, దేవుని చిత్తానుసారంగా నడిచే శక్తి పొందుతూ, ఆయన మనకొరకు దాచియుంచిన ఆశీర్వాదములను పొందగలము.

క్రొత్త నిబంధనలో యేసు ప్రభువు కూడా దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని జీవించినట్లు మనము గమనించగలము. ప్రత్యేకంగా, అపవాది తనను శోధించుచున్న సమయంలో ఆయన కేవలం వ్రాయబడిన వాక్యముతోనే ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇది మన జీవితంలోని ప్రతి పరిస్థితిలో దేవుని వాక్యము ఎంత ప్రాముఖ్యత కలిగినదో, ఆ వాక్యాన్ని మన మనస్సులో నిలుపుకొని దాని ప్రకారము జీవించుట ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది.

అందుచేత మనము ప్రతిరోజూ బైబిల్ చదవడం, క్విజ్‌లలో పాల్గొనడం ద్వారా చదివిన వాక్యాలను సులభంగా అర్థం చేసుకోవడానికి మరియు మెరుగ్గా గుర్తుంచుకోవడానికి సహాయపడుతుంది. అందుకే thebiblequiz.in లోని రోజువారీ బైబిల్ క్విజ్‌లు అధ్యాయం వారిగా రూపొందించబడి, క్రమపద్ధతిగా బైబిల్‌ను చదవడం మరియు అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి అని మేము ఆశిస్తున్నాము.