Quiz Topic: 2 కొరింథీ 8వ అధ్యాయము


1) \'ఆయన (యేసుక్రీస్తు) ధనవంతుడై యుండియు మీరు తన దారిద్య్రమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను\' అను వాక్యభాగమేమిటి?

2) \'వారు బహు శ్రమవలన పరీక్షింపబడగా, అత్యధికముగా సంతోషించిరి\' అని పౌలు ఎవరి గురించి చెప్పెను?

3) ప్రతివిషయములో, అనగా ఏ ఏ విషయములలో కొరింథీ సంఘము వారు అభివృద్ధిపొందుచున్నారు?

4) తీతు తనకు ఏమవుతాడని పౌలు చెప్పుచున్నాడు?

5) మాసిదోనియ వారు మొదట ____నకును, దేవుని చిత్తమువలన అపొస్తలులకును తమ్మును తామే అప్పగించుకొనిరి?

6) హెచ్చుగా కూర్చుకొనినవానికి ఎక్కువ మిగులలేదు, తక్కువగా కూర్చుకొనినవానికి తక్కువ కాలేదు అని వ్రాయబడియున్నదని పౌలు చెప్పెను.

7) ప్రభువు దృష్టియందు మాత్రమే గాక మనుష్యుల దృష్టియందును ___ఐన వాటిని గూర్చి పౌలు శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నామని చెప్పెను?

8) నిరుపేదలైనను, దాతృత్వము బహుగా విస్తరించిన సంఘము ఏది?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.