Quiz Topic: అపో. కార్యములు 25, 1 నుండి 27 వచనములు వరకు


1) ఫేస్తు ఫేలిక్సు నుండి అధికారము పొందిన ఎన్ని దినములకు కైసరయనుండి యెరూషలేమునకు వెళ్లెను?

2) పౌలుమీద నేరము మోపుటకు తనతోకూడ కైసరయకు ఎవరిని రమ్మని ఫేస్తు చెప్పెను?

3) యెరూషలేమునుండి ఫేస్తు న్యాయపీఠము నొద్దకువచ్చిన యూదులు పౌలుమీద ఎటువంటి నేరములు మోపిరి?

4) ___ గూర్చి ఎంత మాత్రమును తప్పిదము చేయలేదని పౌలు చెప్పెను?

5) ఫేలిక్సు వలె ఫేస్తు కూడా ఎవరిచేత మంచివాడనిపించు కొనవలెనని ఆశపడెను?

6) న్యాయము తప్పి మరణమునకు తగినదేదైనను చేసినయెడల మరణమునకు వెనుకతీయను అని పౌలు చెప్పెను.

7) రాజైన అగ్రిప్ప ఎవరిని దర్శనము చేసికొనుటకు కైసరయకు వచ్చెను?

8) పౌలు చెప్పుకొనునది వినుటకు అగ్రిప్పరాజు అధికారమందిరములోకి ఏ విధముగ ప్రవేశించెను?

9) \'ఇతడు(పౌలు) మరణమునకు తగినది ఏమియు చేయలేదని నేను గ్రహించి\' అని ఎవరు ఎవరితో చెప్పుచున్నారు?

10) నేరము మోపబడివవాడు నేరము మోపినవారికి ముఖా ముఖిగా వచ్చి సమాధానము చెప్పుకొనుటకు అవకాశమిచ్చుట రోమీయుల ఆచారము.

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.